Martin Luther King OTT : సంపూ మార్టిన్ లూథ‌ర్ కింగ్ ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నాడు.. ఎప్ప‌టి నుండి అంటే..!

November 22, 2023 9:47 PM

Martin Luther King OTT : ఇటీవ‌లి కాలంలో రీమేక్ సినిమాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో చిన్న సినిమాగా విడుద‌లై రెండు జాతీయ అవార్డును గెలుచుకుని ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన మండేలా సినిమాను కొద్ది రోజుల క్రితం తెలుగులో మార్టిన్ లూథ‌ర్ కింగ్ పేరుతో రీమేక్ చేశారు. త‌మిళంలో యోగి బాబు చేసిన పాత్ర‌ను తెలుగులో సంపూర్ణేశ్ బాబు చేశాడు. పూజా ఆప‌ర్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా న‌రేశ్‌, వెంక‌టేశ్ మ‌హా కీల‌క పాత్ర‌లు పోసించారు. ఈ చిత్రం తెలుగులోను మంచి విజయం సాధించింది. అక్టోబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి వెళ్లిన విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు.

అయితే ‘సోనీలివ్’ లో ఈ నెల 29 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు.తెల్లారితే తెలంగాణ‌లో ఎన్నిక‌లున్న స‌మ‌యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా చూసిన వారు ఒక్క‌రైనా ఓటు విలువ‌ తెలుసుకుంటార‌న‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు.థియేటర్లలో ఈ సినిమాను మిస్సైన వారు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే చూసి హాయ్ గా ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉంది. చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. ఇద్దరు అన్నదమ్ములు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు. ఇద్దరికీ కూడా సమానంగా ఓట్లు వస్తాయి. అప్పుడు హీరో ఓటు కీలకంగా మారుతుంది. తన ఓటు ప్రెసిడెంట్ ఎవరనేది డిసైడ్ చేస్తుందని తెలిసిన హీరో ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ.

Martin Luther King OTT sampoornesh babu release date
Martin Luther King OTT

ఈ చిత్రానికి స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్, వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.ఒక్క ఓటు విలువ ఎంతో చాటి చెప్పే చమత్కారమైన పొలిటికల్ సెటైర్ మూవీ లూథ‌ర్ కింగ్ కాగా ఈ చిత్రంలో ఏదైన స్టార్ హీరో న‌టిస్తే ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించేద‌ని చాలా మంది కామెంట్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now