అర‌కులోయ‌లో విషాదం.. త‌ల్లి, ముగ్గురు పిల్ల‌ల మృతి..

July 17, 2021 10:57 AM

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌రిధిలోని అర‌కు లోయ‌లో విషాదం జ‌రిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఓ మ‌హిళతోపాటు ఆమెకు చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో న‌లుగురి మృత‌దేహాలు ఇంట్లో క‌నిపించాయి. దీంతో ఈ సంఘ‌ట‌న అనేక అనుమానాల‌ను క‌లిగిస్తోంది. స‌ద‌రు మ‌హిళే త‌న పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకుందా ? లేదా ఆమె భ‌ర్త ఈ విధంగా చేశాడా ? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

one mother with her three children died in araku loya

అరకులోయ పట్టణం పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో ఓ మ‌హిళ‌, ఆమె ముగ్గురు పిల్ల‌లు మృతి చెందారు. ఆమె ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా ఆమె ముగ్గురు పిల్ల‌లు ఇంకో గదిలో చ‌నిపోయారు. అయితే వారిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా అప్పటికే వారు చ‌నిపోయార‌ని వైద్యులు తెలిపారు.

అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్‌ (10), కుమారులు సర్విన్‌ (8), సిరిల్‌(4)లతో కలిసి పాత పోస్టాఫీస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇద్ద‌రు దంప‌తుల‌ మధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే మంచంపై ప‌డి ఉన్న త‌న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో వెంట‌నే అక్క‌డి ఏరియా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు.

పిల్లలను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరోవైపు తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని అరకు పోలీసులు తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. అయితే సంజీవ‌రావే తమ కూతురు, మనవలను హత్య చేసి నాటకాలు ఆడుతున్నాడని సురేఖ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment