Salman Khan : న‌టుడికి ప‌బ్లిక్‌గా స‌ల్మాన్ ఖాన్ ముద్దులు.. ఇదేమి చోద్యం అంటున్న నెటిజ‌న్స్..

November 19, 2023 5:20 PM

Salman Khan : బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు. ఇలా క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్న స‌ల్మాన్ ఇటీవ‌ల పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ బడా హీరో ‘టైగర్ 3’ అనే మూవీని చేశాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు అంత అంత మాత్రంగానే వ‌స్తున్నాయి.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్‌కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.

టైగ‌ర్ 3కి సంబంధించి తాజాగా స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌గా, ఈవెంట్‌లో స‌ల్మాన్ ఖాన్ చేసిన ప‌ని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. చిత్రంలో కత్రినా కైఫ్ తో నేను చేసిన రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇమ్మాన్ క‌నుక అతిష్ పాత్ర చేయ‌క‌పోతే అతనికి ఇలానే అయ్యేది అంటూ ఇమ్రాన్ ద‌గ్గ‌రకి వెళ్లి అత‌ని మొహంపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. స‌డెన్‌గా ఇమ్రాన్‌కి స‌ల్మాన్ ముద్దులు పెట్ట‌డంతో స్టన్ అయ్యాడు. అటు ఆడియన్స్ నుంచి అరుపులు, విజిల్స్ వేస్తూ తెగ ర‌చ్చ చేశారు. సాధార‌ణంగా ఇమ్రాన్ ఎక్కువ‌గా ముద్దు స‌న్నివేశాల‌లో న‌టిస్తారు. అయితే తాను ఎక్కువగా ముద్దు సన్నివేశాల్లో నటించలేదు అని స‌ల్మాన్ అన్నాడు.

Salman Khan on the success of tiger 3 movie
Salman Khan

టైగర్ 3 సక్సెస్ మీట్ లో.. పబ్లిక్ గా ముద్దుల వర్షం కురిపించ‌డంతో అంద‌రు కత్రీనా అని ఫీలై బాలీవుడ్ హీరో ఇమ్రాన్ పై ముద్దుల వ‌ర్షం కురిపించాడంటూ కొంద‌రు కామెంట్ చేస‌క్తున్నారు. నవంబర్ 12న రిలీజ్ అయిన టైగ‌ర్ 3 చిత్రంపై భారీ అంచనాలు ఉండ‌గా, ఈ సినిమా అభిమానులని మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది.. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతం చేసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందాడు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now