ఎస్‌బీఐ అల‌ర్ట్‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఈ ప‌నిని త‌ప్ప‌క‌ చేయాలి..!

July 16, 2021 9:17 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన‌ వినియోగదారులను తమ త‌మ‌ పాన్ ల‌ను ఆధార్‌ల‌తో అనుసంధానించాలని సూచించింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఉండాలంటే త‌మ‌ శాశ్వత ఖాతా నంబర్ (పాన్) ను ఆధార్‌తో లింక్ చేయాల‌ని, దీంతో ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చ‌ని ఎస్‌బీఐ తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

sbi customers must do this

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి అని ఎస్‌బీఐ తెలిపింది. అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి, ఇబ్బందులు లేని బ్యాంకింగ్ సేవల‌ను కొనసాగించడానికి వినియోగదారులు వారి పాన్‌ల‌ను ఆధార్‌ల‌తో అనుసంధానించాలని సూచిస్తున్నాం.. అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఒకవేళ ఎస్‌బీఐ కస్టమర్లు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే వారి పాన్‌ పనిచేయకుండా పోతుంది. లేదా క్రియారహితంగా ఉంటుంది. ఖాతాదారుల పాన్ ప‌నిచేయ‌క‌పోతే లావాదేవీలను నిర్వహించడానికి వీలు కాదు. అందువ‌ల్ల పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలి. ఇందుకు చివరి తేదీని సెప్టెంబర్ 30గా నిర్ణ‌యించారు. క‌నుక బ్యాంకు సేవ‌ల‌కు అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఖాతాదారులు త‌మ పాన్‌ల‌ను ఆధార్‌ల‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.

ఖాతాదారులు www.incometax.gov.in కు వెళ్లి లింక్ ఆధార్‌ పై క్లిక్ చేయాలి. త‌రువాత వ‌చ్చే ఆప్ష‌న్ల ప్ర‌కారం ఆయా వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. దీంతో పాన్, ఆధార్ లింక్ అవుతాయ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment