Anil Ravipudi : డైరెక్ష‌న్ మానేసి రాజ‌కీయాల‌లోకి అనీల్ రావిపూడి.. ఏ పార్టీలో చేర‌నున్నాడు అంటే..!

November 18, 2023 10:50 AM

Anil Ravipudi : టాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అనీల్ రావిపూడి. రాజ‌మౌళి తర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్‌లో స‌క్సెస్ సాధించాడు అనీల్. ఇటీవ‌ల బాల‌య్య‌తో క‌లిసి భ‌గ‌వంత్ కేస‌రి అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం కూడా మాస్ మూవీగా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించింది. డైలాగ్ రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు. ఇక అక్కడి నుంచి తీసిన ప్రతి సినిమా విజ‌యం సాధించ‌డంతో స్టార్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఇప్పటివరకు ఏడు సినిమాలు తెరకెక్కించగా ఏడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆయా హీరోలకు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

‘భగవంత్ కేసరి’తో సక్సెస్ అందుకున్న అనీల్ రావిపూడి త‌న త‌దుప‌రి మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడని అనుకుంటే ఉన్నట్టుండి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయనే ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అనిల్ రావిపూడి పొలిటికల్ లుక్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్ చేశారు. నేను ఎంటర్టైన్ చేశాను, మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈసారి నాకు గెలుపు థియేటర్లో కాదు. అసెంబ్లీ.. ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. బాక్సాఫీస్ సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది. మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్ఫర్మేషన్ తో త్వరలో వస్తా” అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.

Anil Ravipudi reportedly getting into politics
Anil Ravipudi

అనిల్ రావిపూడి పొలిటికల్ గెటప్ తో పాటు ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ గా మారాయి. అయితేఈ గెట‌ప్ చూసిన వారంద‌రు అనీల్ నిజంగానే రాజ‌కీయాల‌లోకి వ‌స్తారు అని అనుకున్నారు. కాని అస‌లు విష‌యం ఏంటంటే.. . ఇదంతా ఓ షో కోసం అని తెలుస్తుంది. తెలుగు ఓటీటీ స‌ఆహా… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో పొలిటికల్ కాన్సెప్ట్ తో ఓ షో ప్లాన్ చేస్తుండ‌గా, దానికి అనిల్ రావిపూడి యాంకర్ గా వ్యవహరిస్తారని సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రోమోని రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రవితేజ త‌న త‌దుప‌రి చిత్రంగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలోనే చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now