My Name Is Shruthi Movie Review : ట్విస్ట్‌ల‌తో సాగే మై నేమ్ ఈజ్ శృతి రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..!

November 17, 2023 7:24 PM

My Name Is Shruthi Movie Review : తెలుగులో వచ్చిన దేశ‌ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన క‌థానాయిక హ‌న్సిక‌. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన హ‌న్సిక జూనియర్ ఖుష్బూ అని పేరు పొందింది. తమిళంలో ఆమెకు గుడి కట్టడంతో కోలీవుడ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకు క్రమక్రమంగా దూరమయ్యారు. కొంచెం విరామం తర్వాత హన్సిక ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి. ఇది హన్సిక మొదటి మహిళా ప్రాధాన్య చిత్రమిది. న‌వంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా,ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించింది అనేది చూద్దాం. ముందుగా చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే… మంత్రి కావాలనేది ఎమ్మెల్యే గురుమూర్తి (ఆడుకాలం నరేన్)కి 20 ఏళ్ల కలగా ఉండేది.

హైదరాబాద్ సిటీలో రహస్యంగా స్కిన్ ట్రేడింగ్ (మనుషుల చర్మాన్ని వలిచి వేరొకరికి కాస్మొటిక్ సర్జరీ) చేయడం అతని బిజినెస్. అడ్డొచ్చిన వాళ్ళను అతి కిరాతకంగా చంపడం అతని నైజం కాగా, గురుమూర్తిని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అతనికి శృతి (హన్సిక) ఫ్లాటులో దొరికిన అను (పూజా రామచంద్రన్) శవానికి సంబంధం ఏమిటి? ఈ కేసును ఏసీపీ రంజిత్ (మురళీ శర్మ) ఎలా సాల్వ్ చేశారు? అసలు, అనూని ఎవరు చంపారు? ఆమెకు, డ్రగ్ డీలర్స్, స్కిన్ ట్రేడర్స్ మధ్య సంబంధం ఏమిటి? పోలీసుల దగ్గర శృతి దాచిన నిజం ఏమిటి? ఆమె బాయ్ ఫ్రెండ్ చరణ్ (సాయి తేజ) ఎవరు? అతను ఏమయ్యాడు? అనేది చిత్ర క‌థ‌. సినిమాపై పూర్తి క్లారిటీ రావాలంటే థియేట‌ర్‌కి వెళ్లాల్సిందే.

My Name Is Shruthi Movie Review
My Name Is Shruthi Movie Review

విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత భార్యకు స్క్రిన్ సమస్య రావడంతో కిరణ్మయి ఎంట్రీతో స్క్రిన్ గ్రాఫ్టింగ్ అనే ఓ కాస్మోటిక్ ఇండస్ట్రీ కుంభ కోణం కథ అనే లీడ్ ఇచ్చి కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఇక ఫస్టాఫ్‌లో ట్విస్టులు వదులుకొంటూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత నిదానంగా సాగింది.సెకండాఫ్‌పై పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే కథను దర్శకుడు పరుగులు పెట్టించారు. దర్శకుడి స్క్రీన్ ప్లేకు తగినట్టుగా హన్సిక ఫెర్ఫార్మెన్స్ జత కావడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వదలిన ట్విస్టులను జాగ్రత్తగా క్లోజ్ చేసుకొంటూ వెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్‌తో డీల్ చేసిన విధానం బాగుంది. మెడికల్ మాఫియా మీద వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘మే నేమ్ ఈజ్ శృతి’ ఒకటి. కాన్సెప్ట్ బావుంది. కానీ, స్టార్టింగ్ సీన్స్ అంతగా ఆకట్టుకోవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now