దారుణం: బావిలో పడిన 8 ఏళ్ల చిన్నారిని రక్షించబోయి.. 40 మంది బావిలో పడ్డారు!

July 16, 2021 9:15 PM

మధ్యప్రదేశ్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.బావిలో పడిన ఎనిమిది సంవత్సరాల చిన్నారిని కాపాడటానికి వచ్చిన 40 మంది రెస్క్యూ సిబ్బంది ఆ బావిలో పడి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 23 మందిని సురక్షితంగా బయటకు తీసి సరైన చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని విషాది బావి లో చిన్నారి ఆడుకుంటూ బావిలో పడిపోయింది. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు బావి వద్దకు గుమికూడారు. అదేవిధంగా చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం, ట్రాక్టర్‌తో సహా బావిలో పడిపోయారు. అధిక జనాలు గూమిగూడటంతో అధిక తీవ్రత కారణంగా బావి పక్కన గోడ కూలి రెస్క్యూ బృందం మొత్తం బావిలో పడగా, 23 మందిని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సంఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ ప్రమాదంలో చిన్నారి మిగిలిన 17 మంది సమాచారం తెలియడం లేదు. భావి సరిహద్దు విరిగిపడటంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ శిథిలాల కింద బాలిక పడి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్య శాఖ మంత్రి మంత్రి విశ్వస్ సారంగ్‌ని ఆదేశించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment