Gopichand : బిగ్ స‌ర్‌ప్రైజ్‌.. ప్ర‌భాస్ మూవీలో విల‌న్‌గా గోపీచంద్..?

November 15, 2023 7:40 PM

Gopichand : టాలీవుడ్‌లో కొంద‌రు హీరోల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విష‌యం తెలిసిందే. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోను మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో ప్ర‌భాస్- గోపిచంద్ కాంబో ఒక‌టి. దర్శకుడు కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్. మొదటి హీరోగా ఈయన సినిమా నటించగా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అనంతరం విలన్ పాత్రలలో నటించారు.ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రభాస్ హీరోగా నటించినటువంటి వర్షం సినిమాలో ప్రభాస్ కు విలన్ పాత్రలో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు.

మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించారు గోపిచంద్. అయితే ప్ర‌స్తుతం హీరోగా న‌టిస్తున్న గోపిచంద్ ఇప్పుడు ప్ర‌బాస్ కోసం విల‌న్‌గా మార‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్.. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విల‌న్ గా గోపిచంద్‌ని అనుకన్నార‌ట‌. అయితే హీరోగా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో గోపిచంద్ విల‌న్ పాత్ర‌లు పోషించేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. కాని ఇప్పుడు ప్ర‌భాస్ కోసం విల‌న్ గా న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు ఈ న్యూస్ వైర‌ల్ అవుతుంది.

Gopichand might be acting in prabhas movie
Gopichand

కాగా, గోపిచంద్ ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోలో పాల్గొన‌గా త‌ను, ప్ర‌భాస్ ఓ హీరోయిన్ కోసం గొడ‌వ‌ప‌డ్డార‌ని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ ‘మీరిద్దరూ ఓ హీరోయిన్‌ కోసం గొడవపడ్డారు కదా ఎవరామే?’ అని అడిగాడు. దానికి ప్రభాస్‌, గోపిచంద్‌తో ‘చెప్పొద్దురా’ అంటూ అడ్డుకున్నాడు. కానీ గోపిచంద్‌ ‘అవును సర్‌ మేము 2004లో వర్షం సినిమాలో త్రిష కోసం గొడవపడ్డాం’ అని చెప్పాడు. దానికి ప్రభాస్‌ ‘మా వాడు సూపర్‌గా సమాధానం ఇచ్చాడు’ అంటూ నవ్వాడు. ఇదంతా చూస్తున్న బాలకృష్ణ ‘ఒంగోలు తెలివితేటలు ఇక్కడ వాడకు’ అంటూ గోపిచంద్‌ను సరదాగా అన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now