Siri Hanmanth : జ‌బ‌ర్ధ‌స్త్ కొత్త యాంక‌ర్ సిరి.. ర‌ష్మీ-అన‌సూయ‌ల‌నే మించిపోయిందిగా..!

November 12, 2023 8:20 AM

Siri Hanmanth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వినోదం పంచుతున్న‌షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్యక్ర‌మం నుండి పాత నీరు వెళ్ల‌డం కొత్త నీరు రావ‌డం జ‌రుగుతుంది. కమెడీయన్స్, యాంక‌ర్స్, జ‌డ్జెస్ వెళ్లిపోవ‌డం, కొత్త వాళ్లు తిరిగి రావ‌డం జ‌రుగుతుంది. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ మాత్రం ఎప్పటిక‌ప్పుడు టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోయేది. సుధీర్,గెటప్ శ్రీను, ఆది, అనసూయ, నాగబాబు, రోజా ఇలా అందరూ జబర్దస్త్ షోను నిలబెట్టారు అని చెప్పాలి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండుగా చీలిన త‌ర్వాత కొన్నాళ్ల పాటు ఈ షోల‌ని రష్మీ, అనసూయలు నడిపించారు.నాగ‌బాబు, రోజా వెళ్లి పోయాక ఈ షోకి జడ్జ్‌లుగా కృష్ణ భగవాన్, ఇంద్రజలు ఫిక్స్ అయ్యారు.

ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌కి యాంక‌ర్‌గా సౌమ్య, ఎక్స్ ట్రాకు రష్మీ యాంకర్లుగా ఫిక్స్ అయ్యారు. అంతా బాగుందనుకున్న టైంలోనే సౌమ్య స్థానంలో బిగ్ బ్యూటీ సిరి ఎంట్రీ ఇచ్చింది. . సౌమ్య రావుకు ఏదైనా సమస్య వచ్చి డుమ్మా కొడితే.. సిరిని పట్టుకొచ్చారా? లేదంటే సౌమ్యను తప్పించి సిరిని పెట్టుకున్నారా? అన్నది మాత్రం క్లారిటీ లేదు కాని, కొన్ని వారాల పాటు జ‌బ‌ర్ధ‌స్త్ షోని సిరి న‌డిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్.. బిగ్ బాస్ నుంచి స్టార్ మాలో ఈవెంట్లు, షోల వరకు ఎదిగిన సిరి.. ఇప్పుడు ఈటీవీలో ఇలా మల్లెమాల వారి జబర్దస్త్ షోకు వచ్చింది. అయితే ఇప్పుడు సిరికి.. ర‌ష్మీ, అన‌సూయ‌ల క‌న్నా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌నే చ‌ర్చ కూడా మొద‌లైంది.

Siri Hanmanth taking much remuneration than anasuya and rashmi gautam
Siri Hanmanth

యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరిసిన సిరి హన్మంత్.. రీసెంట్‌గా హిట్టైన జవాన్ సినిమాలో ఓ చిన్న పాత్రలో అలా కనిపించి అల‌రించింది. ఈ సినిమా త‌ర్వాత సిరికి మల్లెమాల ప్రొడక్షన్స్‌ వారు యాంక‌రింగ్ చేసే అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం సిరికి ఉన్న‌క్రేజ్ దృష్ట్యా ఒక్కొక్క ఎపిసోడ్ కి మూడు లక్షల 50 వేలు ఇస్తున్నార‌ట . కెరీర్ స్టార్టింగ్‌లో ర‌ష్మీ,అన‌సూయ‌కి కేవలం లక్ష 50 వేలు మాత్ర‌మే తీసుకున్నారు . అయితే సిరి హనుమంతు మాత్రం ఏకంగా దానికి డబల్ రేంజ్ లో అందుకుంటుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే సిరి హ‌న్మంత్‌కి ఉన్న క్రేజ్, ఆమె ఫిగ‌ర్‌కి ఉన్న ఫోక‌స్ దృష్ట్యా అంత ఇవ్వ‌డంలో త‌ప్పు లేదంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now