ఉదయాన్నే అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న మంచు లక్ష్మి

July 15, 2021 10:28 PM

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు మనకు తెలిసిందే. తాజాగా ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లిన మంచు లక్ష్మి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పలు షూటింగ్స్ కారణంగా మంచు లక్ష్మి ఉన్నఫలంగా వెకేషన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న మంచులక్ష్మి తన పనిలో నిమగ్నమయ్యారు.

మంచు కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పవచ్చు. నేడు షూటింగ్ ఉండటంతో, మంచు లక్ష్మి ఉదయమే నిద్ర లేచి… తయారయ్యి కరెక్టుగా ఏడు గంటలకు షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టిన ఈమె అంతా సిద్ధమైంది షూటింగ్ ప్రారంభం కావడమే మిగిలి ఉంది. షూటింగ్ మొదలవుతుందన్న ఆ సమయంలోనే అసలు సమస్య వచ్చిందంటూ లక్ష్మి ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి ట్వీట్ చేస్తూ.. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం.. కానీ అన్ని జరగవు. నేను ఉదయమే లేచి షూటింగ్ కోసం రెడీ అయ్యాను. షూటింగ్ మొదలవుతుందనుకున్న సమయంలోనే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మనిషి తలిచాడు ఆ దేవుడు తిరస్కరించాడు అన్నట్టుగా మంచు లక్ష్మి పరిస్థితి ఉంది.ఏదిఏమైనా ఎంతో హుషారుగా ఉదయమే తన పనులు పూర్తి చేసుకొని షూటింగ్ స్పాట్ కి వెళ్ళిన మంచు లక్ష్మికి ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now