Lemon And Mint : పుదీనా, నిమ్మ‌రసం క‌లిపి తీసుకుంటే.. ఊహించ‌ని లాభాలు..!

November 9, 2023 1:17 PM

Lemon And Mint : ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా వంటలకి మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది. పుదీనాని తీసుకుంటే, ఎన్నో రకాల లాభాలను కూడా పొందవచ్చు. నిమ్మకాయ కూడా, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పుదీనా, నిమ్మకాయ రెండూ కలిపి తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, నీటిలో పది పుదీనా ఆకుల్ని వేసుకుని, ఐదు నిమిషాల పాటు నీటిని మరిగించి, తర్వాత ఆ నీటిని వడకట్టు వేసుకుని, అర చెక్క నిమ్మరసం కలిపి తాగితే, చాలా మంచిది. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పుదీనా పెంచుతుంది. వేసవిలో అలసట, నీరసం లేకుండా పుదీనా చూస్తుంది.

అధిక బరువు, పొత్తికడుపు కొవ్వుని కరిగించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళకి, చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఒత్తిడి, డిప్రెషన్ కూడా లేకుండా ఉండొచ్చు. అలసట కూడా తగ్గుతుంది. శక్తి కూడా వస్తుంది. పైగా, హుషారుగా ఉండడానికి కూడా సహాయపడుతుంది.

Lemon And Mint many wonderful health benefits
Lemon And Mint

నోటి దుర్వాసన సమస్య నుండి కూడా గట్టెక్కిస్తుంది. ఇలా, పుదీనా, నిమ్మరసం తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా, పుదీనా, నిమ్మ రసంని తీసుకోవడం మంచిది. అప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయి.

కాబట్టి రెగ్యులర్ గా, పుదీనా నిమ్మకాయ కలిపి తీసుకోవడం మంచిది. ఈజీ గానే మనకి ఇవి దొరుకుతాయి. ఏ సీజన్లో అయినా సరే అందుబాటులో ఉంటాయి. పుదీనాని కావాలంటే మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. పుదీనా, నిమ్మతో ఈ విధంగా మనం లాభాలను పొంది మరింత ఆరోగ్యంగా మారొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now