సెల్ఫీ మోజు: జలపాతం అంచున సెల్ఫీ దిగిన యువతి.. వైరల్ గా మారిన ఆఖరి పోస్ట్..

July 15, 2021 6:11 PM

కొందరు సెల్ఫీల మోజుతో ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కొన ప్రాణాలతో బయట పడగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఈ విధంగా సెల్ఫీ పై ఉన్న మోజు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. డేర్‌డెవిల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సోఫియా చుంగ్‌ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించారు.

సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీనీ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కు మంచి వీకెండ్ ఉండాలని భావించింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని హాపాక్‌లై అనే పార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను చూస్తూ ఎంతో మైమరచిపోయింది.

ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టుతప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ జలపాతం నుంచి సోఫియా కింద పడటంతో మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆమె అభిమానులందరికీ మంచి వీకెండ్‌ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయావా.. అంటూ పలువురు నివాళులర్పించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment