ఆల‌య గోపురంపై ప‌డిన పిడుగు.. దెబ్బ‌తిన్న జెండా.. వైర‌ల్ వీడియో..!

July 14, 2021 1:03 PM

రుతు ప‌వ‌నాలు, అల్ప‌పీడ‌నాలు, ద్రోణుల కార‌ణంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వ‌ర్షాలు భారీగా కురుస్తున్నాయి. అనేక చోట్ల వ‌ర్షాలు పెను విధ్వంసాల‌ను సృష్టిస్తున్నాయి. నిన్న కాక మొన్న యూపీ, రాజ‌స్థాన్‌ల‌లో పిడుగులు ప‌డి ఏకంగా 87 మంది మృతి చెందారు. ఇక తాజాగా గుజ‌రాత్‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తూ పిడుగులు ప‌డుతున్నాయి.

lightening strike on temple gopuram viral video

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుజ‌రాత్‌లోని దేవ‌భూమి ద్వార‌క జిల్లాలో ఉన్న ద్వార‌కాధీష్ ఆల‌యంపై పిడుగులు ప‌డ్డాయి. దీంతో ఆల‌య గోపురంపై ఉన్న జెండా దెబ్బ తిన్న‌ది. పిడుగు నేరుగా ఆ జెండా మీదే ప‌డింది. అయితే ఆ పిడుగు వ‌ల్ల ఆల‌యానికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఆ స‌మ‌యంలో ఆల‌యంలో, చుట్టు ప‌క్క‌ల కొంద‌రు భ‌క్తులు ఉన్నారు. కానీ ఎవ‌రికీ ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు.

ఇక అదే స‌మ‌యంలో వీడియో తీసి దాన్ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆల‌యంపై పిడుగు ప‌డిన ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. చూస్తుంటేనే చాలా భ‌యంగా అనిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆ జిల్లా పాల‌క విభాగం అధికారుల‌తో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని అధికారులు మంత్రికి చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment