ఎన్టీఆర్ రోజుకు 24 ఇడ్లీలు, 40 బజ్జీలు తీసునేవారట.. ఆయన ఆహారపు అలవాట్లు చూస్తే కచ్చితంగా షాక‌వుతారు..!

October 21, 2023 5:28 PM

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అంటే, ముఖ్యంగా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు, మనకి గుర్తుకు వస్తాయి. చాలామంది ఎన్టీఆర్ లాగ మంచి హీరో అవ్వాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు.

ఎన్టీఆర్ కుటుంబం నుండి చాలామంది హీరోలు రావడం జరిగింది. అలానే ఆ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా. ఎన్టీఆర్ ఉన్నంతకాలం స్వర్గ యుగంలో ఉండేదని, చాలామంది అంటూ ఉంటారు. సినిమాల్లో ఎన్టీఆర్ చాలా స్పెషల్ గా ఉండేవారు. ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ, తెలియని పాత విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

you will be surprised to know sr ntr food habits

ఎన్టీఆర్ ప్రతి పనిని కూడా టైం టు టైం చేసుకునేవారు. అలానే, ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లలో మాత్రం సర్దుకుపోయేవారు కాదట. పైగా, ఏమాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ చూసుకునే వారు. సరైన భోజనం చేస్తేనే, ఆరోగ్యంగా ఉంటారని ఎన్టీఆర్ అసలు పొరపాట్లు చేసేవారు కాదు. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి, రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారు.

తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారు. బ్రేక్ఫాస్ట్ లో 24 ఇడ్లీలు తినేవారట. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు తినడం కుదరకపోతే, భోజనం తినేసేవారు. కచ్చితంగా మాంసం ఉండేటట్టు ఎన్టీఆర్ చూసుకునేవారు. మాంసాహారం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతిరోజు రెండు లీటర్లు బాదంపాలు కూడా తాగే వారు. చెన్నైలో ఉంటున్నప్పుడు, బజ్జీలు బాగా తినడానికి ఇష్టపడే వారట. ఏకంగా 30 నుండి 40 బజ్జీలు తినేసేవారట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now