Prem Kumar OTT Release Date : ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన.. సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

October 16, 2023 2:12 PM

Prem Kumar OTT Release Date : సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ప్రేమ్ కుమార్ మూవీ, ఆగస్టు 18న థియేటర్ల లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పెళ్లిళ్ల చుట్టూ తిరిగే కామెడీ ఎంటర్టైనర్ గా, ఈ సినిమాని దర్శకుడు తెర మీదకి తీసుకు వచ్చారు. తన కామెడీ టైమింగ్ తో, సంతోష్ అందరినీ బాగా మెప్పించాడు. అయితే, థియేటర్లో మాత్రం ఆశించిన స్థాయిలో, ఈ సినిమా ఆడలేదు. ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ప్రేమ్ కుమార్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది. ఎటువంటి ప్రచారం లేకుండా, ఓటీడీ లోకి ఈ సినిమా నిన్న వచ్చేసింది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా చూద్దాం. నేత్ర (రాశీ సింగ్) తో అవ్వాల్సిన ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్) మ్యారేజ్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఏమో, ప్రేమ్ కుమార్ ఇంకో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ, పెళ్లి మాత్రం పెటాకులవుతుంది. తర్వాత కూడా, కొన్ని సార్లు పెళ్లిళ్లు ఆగాయి.

Prem Kumar OTT Release Date
Prem Kumar OTT Release Date

దీంతో ప్రేమ్ కుమార్‌ కి చిరాకు వస్తుంది. ఇక వెడ్డింగ్ డిటెక్టివ్‍గా మారాడు. వేరే వాళ్ళ పెళ్లిళ్లను చెడగొడుతుంటాడు.
ఇక మరి, చివరికి ప్రేమ్ కుమార్, నేత్ర ఒకటి అయ్యారా లేదా..? అంగన (రుచిత) ను పెళ్లి చేసుకునేందుకు, ప్రేమ్ ఎందుకు సిద్ధం అవుతాడు..?

డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టాక, ఏం జరిగిందనేదే అసలు స్టోరీ. ఇందులో, కామెడీ బాగా వర్కౌట్ అయింది. సంతోష్ శోభన్, సుదర్శన్, కృష్ణ తేజ కామెడీ టైమింగ్ సూపర్ వుంది. అనంత్ శ్రీకర్ ఈ మూవీ కి సంగీతం అందించారు. సారంగ క్రియేషన్స్ పతాకం పై శివ ప్రసాద్ పన్నీరు ఈ మూవీ ని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now