Skanda OTT Release Date : ఓటీటీలోకి రెడీ అయిన రామ్ పోతినేని స్కంద సినిమా.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

October 14, 2023 1:00 PM

Skanda OTT Release Date : రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. అయితే, బోయపాటి దర్శకత్వంలో రామ్ సినిమా కాబట్టి, భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ, ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదు. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇక ఇప్పుడు స్కంద సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ డేట్ బయటికి వచ్చింది.

స్కంద ఓటీటీ హక్కులని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అక్టోబర్ 27వ తేదీ నుండి, స్కంద సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటుగా, ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లో కూడా స్ట్రీమింగ్ కి రాబోతోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాని, ఫుల్ యాక్షన్ మూవీగా తెర మీదకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా ఉన్నాయి.

Skanda OTT Release Date
Skanda OTT Release Date

మాస్ యాక్షన్ లుక్ లో రామ్ పోతినేని కనపడి, బాగానే ఆకట్టుకున్నారు. కానీ, సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ పోతినేని సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. అలానే, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో కనపడ్డారు.

బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను కూడా రాబట్ట లేకపోయింది. ఇది ఇలా ఉంటే, రామ్ ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా, ఈ సినిమాను తెరమీదకి తీసుకు రానున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now