67 వాట్ల చార్జ‌ర్‌ను లాంచ్ చేసిన షియోమీ.. దీంతో మీ ఫోన్ కేవ‌లం 30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది..!

July 12, 2021 2:33 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ కొత్తగా ఎంఐ 67డ‌బ్ల్యూ సోనిక్ చార్జ్ 3.0 పేరిట ఓ నూత‌న 67 వాట్ల చార్జ‌ర్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. 6ఎ ప‌వ‌ర్ క‌లిగిన ఈ చార్జ‌ర్‌ను యూఎస్‌బీ టైప్ సి పోర్టు ఉన్న ఫోన్లు క‌లిగిన యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు. ఇక ఈ చార్జ‌ర్ ద్వారా 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ క‌లిగిన ఫోన్ల‌ను కేవ‌లం 36 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వ‌ర‌కు చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

xiaomi launched Mi 67W SonicCharge charger which charges phone completely in 30 minutes

అయితే ఈ చార్జ‌ర్‌ను వాడుకోవాలంటే ఫోన్‌కు స‌పోర్ట్ ఉండాలి. అప్పుడే దీన్ని వాడుకోగ‌ల‌రు. ఔట్ పుట్ ప‌వ‌ర్ 15W (5V-3A) / 27W (9V-3A), (20V-1.35A) / 33W (11V-3A) / 67W (20V-3.35A), (11V-6.1A) ఉన్న చార్జ‌ర్లు క‌లిగిన వారు ఈ చార్జ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాల‌జీ ఆధారంగా ఈ చార్జ‌ర్ ప‌నిచేస్తుంది.

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర డివైస్‌ల‌ను దీంతో చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ఈ చార్జ‌ర్ ధ‌ర రూ.1,999గా ఉంది. దీన్ని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీనికి 6 నెల‌ల వారంటీ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now