Tulsi Plant : తులసి మొక్క విషయంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పుల‌ను చేయకూడదు..!

September 28, 2023 1:24 PM

Tulsi Plant : ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో వాస్తు చిట్కాలని పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క వలన అనేక లాభాలు ఉంటాయి. ఔషధ గుణాలు కూడా తులసిలో ఉంటాయి. ప్రత్యేకంగా తులసి గురించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి తులసి చేసే మేలు తెలుసు.

తులసి మొక్క ఇంట్లో ఉంటే ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దురదృష్టం కూడా తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. హిందువులందరూ తులసి మొక్కని పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కలేని ఇల్లు ఉండదు. తులసి మొక్క నెగిటివ్ ఎనర్జీ ని కూడా తొలగించగలదు. అయితే, ఈ తప్పులు మాత్రం చేయకూడదు. తులసి మొక్కని ఎప్పుడూ దక్షిణం వైపు పెట్టకూడదు.

do not do these mistakes with Tulsi Plant
Tulsi Plant

దక్షిణం వైపు తులసి మొక్క ఉండటం వలన ఆర్థిక సమస్యలు వస్తాయి. తులసి మొక్కని ఎప్పుడూ కూడా అపరిశుభ్రమైన చేతులతో ముట్టుకోకూడదు. తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. అటువంటి మొక్కని, మనం స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోవాలి. తులసి మొక్కను ఎప్పుడూ కూడా ముఖద్వారం పక్కనే ఉండకూడదు. ఎందుకంటే అక్కడ మనం చెప్పులు, షూ వంటి వాటిని వదిలేస్తూ ఉంటాము.

అలాంటి చోట అసలు పెట్టకూడదు. తులసి మొక్కను ఎప్పుడూ కూడా ఆదివారం పూట, ఏకాదశి రోజు, గ్రహణ సమయంలో ముట్టుకోకూడదు. నీళ్లు కూడా పోయకూడదు. ప్రతిరోజు తులసి మొక్క దగ్గర శుభ్రం చేయడం చాలా ముఖ్యం. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ శుభ్రత పాటించాలి. తులసి మొక్క ఎదుట చెత్తాచెదారం ఉండకూడదు. డస్ట్ బిన్ పక్కన తులసి మొక్కను పెట్టడం వంటివి కూడా చేయకూడదు. ఇలా, వీటిని కనుక మీరు గుర్తుపెట్టుకుని పాటించినట్లయితే, అంతా మీకు మంచి జరుగుతుంది. సమస్యలు కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment