Money Plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ వాస్తు నియమాలని కచ్చితంగా పాటించండి..!

September 20, 2023 7:53 PM

Money Plant : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలని పెంచుతూ ఉంటారు. ఇంట్లో అందమైన మొక్కలు ఉంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చాలామంది గార్డెన్ లో అనేక రకాల మొక్కల్ని నాటుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మొక్కల్ని పెంచడం వలన ఇంటికి మంచి జరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రకరకాల పూల మొక్కలతో ఇంటిని చాలామంది అలంకరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది.

ఇండోర్, ఔట్ డోర్‌లలో మనీ ప్లాంట్ ని ఎక్కువగా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ని లక్ష్మీ స్వరూపంగా కూడా చూస్తారు. ఎంత బాగా మొక్క పెరిగితే అంత సంపద మనకి ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటే మంచిది. మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచడం వలన చక్కటి ఎనర్జీ ఉంటుంది. వాస్తు నియమాలని పాటిస్తే ఇంకా మంచి జరుగుతుంది.

do not make these mistakes with Money Plant
Money Plant

ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ని పెడితే మంచిది. ఖాళీ ప్రదేశం ఉంటే మనీ ప్లాంట్ ని నేల మీద నాటితే మంచిది. కుండీలో కంటే నేల మీద నాటండి. మనీ ప్లాంట్ ని అస్సలు ఈశాన్యం వైపు పెట్టకండి. ఎందుకంటే ఈ దిశని బృహస్పతి గ్రహంగా పరిగణిస్తారు. కాబట్టి తప్పు చేయకండి. ఎప్పుడైనా మొక్క ఎండిపోతే వెంటనే ఆకుల్ని తొలగించేయాలి. ఆకులు ఎప్పుడూ నేలని తాకకుండా చూసుకోవాలి.

ఇలా ఈ తప్పులు జరిగినట్లయితే ఆటంకాలు, ఇబ్బందులు, ఆనందం లేకపోవడం వంటివి కలుగుతాయి. ఈ మొక్క తీగలని పైకి లేదంటే సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. తీగలు కిందకి వేలాడుతూ ఉండకూడదు. మనీ ప్లాంట్ ఎంత ఏపుగా పెరిగితే అంత మంచి జరుగుతుంది. వాస్తు నియమాలను చూశారు కదా.. మరి ఈసారి మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. సంతోషంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment