బిగ్ బాస్ ఫేమ్, సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు.. కత్తి మహేష్ కన్నుమూత..

July 10, 2021 7:40 PM

బిగ్ బాస్ ఫేమ్, సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు.. కత్తి మహేష్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయ‌న‌ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ పరిస్థితి విషమించింది. దీంతో ఆయ‌న చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీక‌రించారు.

kathi mahesh died

గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ కావ‌డంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి సీరియస్ కావ‌డంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. ఈ క్ర‌మంలో డాక్టర్లు తల, కంటి భాగాల్లో శస్త్రచికిత్స చేశారు.

కాగా కత్తి మహేష్ చికిత్స‌కు అయ్యే ఖర్చుల కోసం ఏపీ ప్ర‌భుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించింది. అయిన‌ప్ప‌టికీ 2 వారాలుగా కత్తి మహేష్‌కు నిపుణులైన‌ డాక్టర్ల‌ బృందం చికిత్స అందించినా ఆయ‌న‌ ప్రాణాలు దక్కలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment