Shankham : రోజూ ఇంట్లో శంఖాన్ని ఊదండి.. ఎన్ని ప్ర‌యోజనాలో తెలుసా..?

September 15, 2023 6:57 PM

Shankham : చాలామంది ప్రశాంతంగా ఉంటుందని ఆలయాలకి వెళుతూ ఉంటారు. కొంచెం సేపు మనం ఏదైనా దేవాలయంలో గడిపితే చాలు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటుంది. తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఏదో శక్తి మనలోకి వస్తుంది. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు గమనిస్తే శంఖం ఊదుతూ ఉంటారు. ఎక్కువగా శివాలయాల్లో శంఖంని ఉంటారు. కొంతమంది అయితే ఇళ్లల్లో శంఖాన్ని పెట్టి ఊదుతూ ఉంటారు. అయితే అసలు ఎందుకు శంఖం ఊదాలి..? శంఖం ఊదితే ఎలాంటి ఫలితం ఉంటుంది.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ పురాణ ఇతిహాసాలలో శంఖానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతుడితో ఎంతో అనుబంధం ఉంది. క్షీరసాగర మధ‌నంలో శంఖం ముందు పుట్టి ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందట. శంఖం నుండి ఓంకార శబ్దం వెలువడుతుంది. శంఖానికి నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Shankham many benefits know about them
Shankham

యుద్ధాలు వంటివి మొదలయ్యేటప్పుడు శంఖాన్ని పూరించి ఆ తర్వాత మొదలు పెడతారు. అయితే ఇలా శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. శంఖం శబ్దంతో మంచి జరుగుతుందట. శుభం జరుగుతుందట. సమస్యలు తొల‌గిపోతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతిరోజూ నాలుగు సార్లు శంఖాన్ని ఇంట్లో ఊదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయమై పోవాలంటే క‌చ్చితంగా ఇంట్లో శంఖాన్ని ఊదండి. శంఖాన్ని ఊదడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో పెట్టి శంఖంని పూజిస్తే సుఖసంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఎంతో ఆనందం ఉంటుంది. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. ఇలా శంఖం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి క‌చ్చితంగా ఇంట్లో పెట్టి పూజించండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment