36 ఏళ్లుగా ఈయ‌న త‌న జీతం మొత్తాన్ని దానం చేస్తూనే ఉన్నారు..! హ్యాట్సాఫ్‌..!

July 10, 2021 4:47 PM

స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ దాన ధ‌ర్మాలు చేస్తారు. త‌మ తాహ‌తుకు త‌గిన‌ట్లుగా కొంద‌రు దానం చేస్తారు. కొంద‌రు అస్స‌లు ఏమీ ఉంచుకోకుండా సంపాదించేది మొత్తం దానం చేస్తుంటారు. ఇప్పుడు చెప్ప‌బోయే వ్య‌క్తి కూడా స‌రిగ్గా అలాంటి కోవ‌కే చెందుతారు. ఆయ‌నే.. త‌మిళ‌నాడుకు చెందిన పాల‌మ్ క‌ల్యాణ సుంద‌రం. ఈయ‌న ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ తాను యుక్త వ‌య‌స్సులో ఉద్యోగం సాధించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 36 ఏళ్లుగా తాను సంపాదించేది మొత్తం దానం చేస్తూనే ఉన్నారు.

this man donation money from his salary from 36 years kudos

క‌ల్యాణ సుంద‌రం ది త‌మిళ‌నాడు రాష్ట్రం. నిరుపేద కుటుంబంలో పుట్టారు. చిన్న‌ప్పుడు తండ్రి మ‌ర‌ణించాడు. దీంతో త‌ల్లి ఆయ‌న‌ను పెంచి పెద్ద చేసింది. ఉన్న‌దాంట్లో నుంచి పేద‌ల‌కు స‌హాయం చేయాల‌నే గుణాన్ని ఆయ‌న త‌న త‌ల్లి నుంచి అల‌వాటు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లిట‌రేచ‌ర్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశాక లైబ్రేరియ‌న్‌గా ఉద్యోగం సాధించాడు. లైబ్ర‌రీ సైన్స్‌లోనూ ఈయ‌న గోల్డ్ మెడ‌లిస్టు.

అయితే క‌ల్యాణ సుంద‌రం పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయ‌న ఉద్యోగం చేస్తున్న‌ప్పటి నుంచి త‌న‌కు నెల నెల వ‌చ్చే మొత్తం జీతాన్ని పేద‌ల‌కు దానం చేసేవారు. ఎక్కువ‌గా చారిటీల‌కు ఆయ‌న జీతాన్ని విరాళంగా ఇస్తూ వ‌స్తున్నారు. ఇక రిటైర్ అయ్యాక కూడా త‌న‌కు ల‌భించిన బెనిఫిట్స్ తాలూకు సొమ్మును ఆయ‌న చారిటీల‌కు అంద‌జేశారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు ద‌క్కాయి.

కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్యాణ సుంద‌రాన్ని అత్యుత్త‌మ లైబ్రేరియ‌న్‌గా గుర్తించి స‌త్క‌రించింది. అమెరికా ప్ర‌భుత్వం ఆయ‌న‌కు మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డును అంద‌జేయ‌గా, కేంబ్రిడ్జి ది ఇంట‌ర్నేష‌న‌ల్ బ‌యోగ్రాఫిక‌ల్ సెంట‌ర్ సంస్థ వారు ఆయ‌న‌ను అత్యంత ఉదాత్త‌మైన వ్య‌క్తిగా గుర్తించారు. ఇక ఐక్య‌రాజ్య‌స‌మితి ఆయ‌న‌ను 20వ శ‌తాబ్ద‌పు విశిష్ట వ్య‌క్తుల్లో ఒక‌రిగా గుర్తించింది. స‌మాజంలో నిజంగా ఇలాంటి వారు ఎక్క‌డో ఒక‌రు ఉంటారు. వీరి వ‌ల్ల పేద‌లకు ఆస‌రా ల‌భిస్తోంది. ఇన్ని సేవ‌లు చేసినందుకు, ఇంత‌టి ఘ‌న‌త సాధించినందుకు ఈయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment