Broccoli For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

September 11, 2023 8:16 PM

Broccoli For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంట ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, గింజలు, విటమిన్స్ ఎక్కువ ఉండే వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు అన్ని కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే బ్రోకలీని ఎక్కువగా తినడం మంచిదే. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రోకలీని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రోకలీని తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మధుమేహంతో ఉన్న ఎలుకలకు సెల్ఫోరఫెన్ ని అందించారు. అయితే ఇది గణనీయంగా గ్లూకోస్ ని తగ్గించిందని స్టడీ చెప్తోంది. గ్లూకోస్ వేగాన్ని హిమగ్లోబిన్ తగ్గిస్తుందని స్టడీ చెప్తోంది. రెండవ దశలో అయితే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న 97 మందికి 12 వారాలు పాటు బ్రోకలీని పెట్టారు.

Broccoli For Diabetes must take for these benefits
Broccoli For Diabetes

బ్రోకలీని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని, ముఖ్యంగా డయాబెటిస్ తగ్గుతుందని స్టడీ చెప్తోంది. షుగర్ ఉన్నవాళ్లు వాడే మాత్రల వలన పొట్ట, కిడ్నీ వంటి అవయవాల‌లో మార్పు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఈ తోపాటు విటమిన్ కె, ఐరన్, ప్రోటీన్ కూడా బ్రోకలీలో ఉంటాయి.

ఆవిరితో ఉడికించిన ఒక కప్పు బ్రోకలీలో 27 క్యాలరీలు, మూడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రోక‌లీని ఎక్కువ తీసుకోవచ్చు. కంటి ఆరోగ్యానికి కూడా బ్రోకలీ మేలు చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు కాలీఫ్లవర్, క్యాప్సికం, క్యారెట్, పాలకూర, పుట్టగొడుగు, గ్రీన్ బీన్స్ ని కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మేలు చేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment