Biryani : రాత్రిపూట బిర్యానీ తింటున్నారా.. మీ శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

August 31, 2023 4:37 PM

Biryani : మనం తీసుకునే ఆహారం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. మనం ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే మన ఆరోగ్యం అనవసరంగా దెబ్బతింటుంది. కొన్ని రకాల తప్పులు చేయడం వలన అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. రాత్రి పూట త్వ‌ర‌గా తినడం మంచిది. రోజూ రాత్రిళ్ళు త్వరగా భోజనం చేసేయాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా సరిగ్గా ఉంచవ‌చ్చు.

రాత్రిపూట ఆలస్యంగా తింటే ఊబకాయం, అధిక రక్తపోటు, షుగర్ వంటి వాటికి దారి తీస్తుంది. కాబట్టి రాత్రిళ్ళు ఎంత త్వరగా అయితే అంత త్వరగా తినేసి నిద్రపోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి 7:00 గంట‌ల‌కి ముందు భోజనం చేయాలి. రాత్రిళ్ళు సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. లిమిట్ గా ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట జీవక్రియ తక్కువగా ఉండడం వలన ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని ఆ తప్పు చేయకండి.

do not take Biryani at night know the reasons
Biryani

అదనపు కేలరీలు కొవ్వులో పేరుకుపోవడం మొదలుపెడతాయి. కాబట్టి రాత్రిళ్ళు త్వరగా తినడం తేలికగా తినడం చాలా అవసరం. రాత్రిపూట బిర్యానీ వంటివి తీసుకోకూడదు. అధికంగా కొవ్వు క‌లిగిన‌ ఆహార పదార్థాలని రాత్రిళ్ళు తీసుకోవడం వలన శరీరంలో కొన్ని భయంకరమైనవి చోటు చేసుకుంటాయి. రాత్రిపూట గుడ్డు పచ్చ సొన తింటే కూడా మంచిది కాదు. రాత్రిపూట ఎక్కువ తింటే, పిత్తాశయ రాళ్లు ఉన్నవారిలో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

రాత్రిపూట ఎక్కువగా తినడం వలన నిద్రకి కూడా ఆటంకం కలుగుతుంది. బాగా నిద్రపోలేరు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రాత్రిపూట ఎక్కువగా తింటే గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా తినడం వలన జీర్ణకోశ సమస్యలు వస్తాయి. పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట, మలబద్ధకం ఇలాంటివి కల‌గవచ్చు. కాబట్టి, రాత్రిళ్ళు ఎక్కువ ఆహార పదార్థాలను తీసుకోకండి. లైట్ గా తీసుకోండి. త్వరగా తీసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment