Heat In Body : ఈ పండ్లను తింటే వేడి మొత్తం తగ్గుతుంది..!

August 23, 2023 10:02 PM

Heat In Body : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం పాడవదు. మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీర వేడిని తగ్గించాలంటే కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. శరీర వేడిని తగ్గించడానికి ఈ పండ్లని మీరు తీసుకుంటూ ఉండండి. అప్పుడు కచ్చితంగా వేడి తగ్గుతుంది. ఒళ్ళు చల్లబడుతుంది.

వేసవిలో ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మామూలు సమయంలో కూడా చాలా మందికి ఈ సమస్య కలుగుతుంది. పుచ్చకాయని తీసుకుంటే డీహైడ్రేషన్ బాధలు ఉండవు. జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. పుచ్చకాయలోని నీళ్లు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. మామిడి కూడా వేడిని తగ్గిస్తుంది. మామిడిపండుని జ్యూస్ చేసుకుని తీసుకుంటే హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. పొట్ట చల్లగా కూడా ఉంటుంది.

Heat In Body take these fruits daily
Heat In Body

మల్బెరీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. దానితో పాటుగా చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. స్ట్రాబెర్రీలను తీసుకుంటే కూడా వేడి తగ్గుతుంది. రిఫ్రెష్ గా ఉండొచ్చు. శరీరంలో వేడి తగ్గి హ్యాపీగా ఉంటుంది. పోషకాలు కూడా స్ట్రాబెర్రీలలో ఎక్కువగా ఉంటాయి.

దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. దోసకాయ తీసుకుంటే కూడా పోషకాలు బాగా అందుతాయి. కీరదోసని వేసవిలో తీసుకోవడం వలన ఒళ్ళు చల్లగా ఉంటుంది. మామూలు సమయంలో తీసుకుంటే కూడా డీహైడ్రేషన్ వంటి బాధలు ఉండవు. చల్లగా ఉంటుంది. కర్బూజా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషకాలు కర్బూజాలో కూడా ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించి చల్లగా మారుస్తుంది. ఇలా ఈ పండ్లని మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఒంట్లో వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ వంటి బాధలు ఏమీ కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment