Biscuits Dipped In Tea : రోజూ మీరు తాగే టీ లో బిస్కెట్ల‌ను ముంచి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

August 23, 2023 11:54 AM

Biscuits Dipped In Tea : చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బిస్కెట్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బిస్కెట్లు కొవ్వు లేకుండా ఉండవు.

కాబట్టి బిస్కెట్లను ఎక్కువగా టీ లో తీసుకుంటే ఊబకాయం, చర్మ సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంటుంది. పంచదార వుండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గించేస్తూ ఉంటాయి. బిస్కెట్ల లో షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ తో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. టీ తో చక్కెర బిస్కెట్లని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిల‌ని అవి పెంచుతాయి. సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్, థైరాయిడ్ ఉన్నవాళ్లు బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదు.

Biscuits Dipped In Tea do not take them like that
Biscuits Dipped In Tea

టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే మల‌బద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సమస్యని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోకండి. సాయంత్రం పూట చాలా మంది సరదాగా వేడిగా ఒక కప్పు టీ తో పాటుగా కొన్ని బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు.

కానీ అలా చేయడం వలన ఇన్ని నష్టాలు ఉంటాయి. బిస్కెట్లలో షుగర్ ఎక్కువ ఉండడంతో పంటి ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దంతాలలో క్యావిటీస్ ఏర్పడతాయి. దంతక్షయం వస్తుంది. ఇలా ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి టీ ని బిస్కెట్ల‌తో పొరపాటున కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే అనవసరంగా ఇన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment