Raisins And Jaggery : ఎండు ద్రాక్ష‌, బెల్లం.. ఈ రెండింటినీ ఇలా తీసుకోండి.. బ‌రువు వేగంగా త‌గ్గుతారు..!

August 22, 2023 11:32 AM

Raisins And Jaggery : చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎండుద్రాక్ష, బెల్లం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎండుద్రాక్ష, బెల్లంని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందొచ్చు. కొంచెం నీళ్లు తీసుకుని అందులో నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను వేసి, రాత్రి అంతా నానబెట్టుకోండి. ఐదు గ్రాముల బెల్లం తీసుకోండి. ముందు ఖాళీ కడుపుతో బెల్లం తిని ఎండు ద్రాక్షని తిని ఆ నీళ్ల‌ని తాగాలి.

ఇలా చేయడం వలన మెటాబలిజం పెరిగి బరువు తగ్గడానికి వీల‌వుతుంది. ఎండుద్రాక్షని పెరుగులో వేసి కూడా తీసుకోవచ్చు. పేగుల‌ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ద్రాక్ష, బెల్లం రెండింట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. జీవక్రియల‌ని పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్, సెలీనియం, జింక్.. బెల్లంలో ఎక్కువగా ఉంటాయి.

Raisins And Jaggery take them in this way to lose weight in no time
Raisins And Jaggery

బెల్లంలో క్యాలరీలు ఉండవు. విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపుని నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, మంచి స్నాక్ ఇది. ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

జీవక్రియల‌ని మెరుగుపరుస్తాయి. అలాగే బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. అయితే బెల్లం, ఎండు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మంచివి. పైగా బరువు కూడా తగ్గచ్చు. కానీ లిమిట్ గానే తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి అవ‌కాశం ఉంటుంది. క‌నుక త‌క్కువ మోతాదులోనే వీటిని తీసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment