చల్ల చల్లని వాతావరణంలో.. వేడి వేడి ఉల్లిపాయ పకోడీలను తినేద్దాం..!

July 8, 2021 9:46 PM

ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో వాతావరణం ఎంతో చల్లగా ఉంది. మరి ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీలు తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పులు

*శెనగపిండి ఒక కప్పు

*పచ్చిమిర్చి 5

*ఉప్పు తగినంత

*బేకింగ్ సోడా చిటికెడు

*నీళ్లు తగినన్ని

*గుప్పెడు కొత్తిమిర

*కరివేపాకు రెమ్మలు 2

*పుదీనా ఆకులు కొన్ని

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలను పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నెలోకి శెనగపిండి, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు, కరివేపాకులు చిన్నగా కత్తిరించి వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నప్పుడే పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఫై నూనె పెట్టుకుని నూనె వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా నూనెలు వేసుకుంటూ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పకోడీలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment