ఆధార్ కార్డ్ మార్చుకోవాలనే వారికి షాక్.. ఇకపై ఆ సర్వీసులు రద్దు..!

July 8, 2021 12:09 PM

మీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లో అడ్రస్ మార్చుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ విషయం అని చెప్పవచ్చు. తాజాగా యూఐడీఏఐ కొన్ని సర్వీసులు నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ విధంగా యూఐడీఏఐ తీసుకున్న నిర్ణయం పలువురు తీవ్ర ప్రభావం చూపించింది. మరి ఆధార్ కార్డ్ ఏ సర్వీసులను రద్దు చేసిందో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం ఆధార్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలి అనుకునేవారు లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకుంటున్నారు. ఇకపై అలా మార్చుకోవడం సాధ్యం కాదని యూఐడీఏఐ వెల్లడించింది. అదేవిధంగా ఆధార్ కార్డును రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఇప్పటి నుంచి ఈ రెండు సేవలో ఆధార్ కార్డు ఉపయోగించే వారికి అందుబాటులో ఉండవని యూఐడీఏఐ వెల్లడించింది.

యూఐడీఏఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అద్దె ఇళ్లలో ఉండే వారి పై తీవ్రమైన ప్రభావం చూపించనుంది. అలాగే ఆధార్ రీప్రింట్ పొందాలనుకునేవారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే ఆధార్ కార్డ్ రీప్రింట్ పొందవచ్చు.అయితే ఇది సాధారణ ఆధార్ కార్డు మాదిరి కాకుండా ఒక డెబిట్ కార్డు రూపంలో మాత్రమే ఉంటుంది. ట్విట్టర్ లో ఒక యూసర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూఐడీఏఐ ఇలాంటి సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment