Almonds Tea : బాదంప‌ప్పుల‌తో టీ త‌యారీ ఇలా.. రోజుకో క‌ప్పు తాగితే ఎంతో మేలు..!

August 11, 2023 2:37 PM

Almonds Tea : చాలా మంది ప్రతి రోజు బాదం ప‌ప్పుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి బాదం చాలా మేలు చేస్తుందని రోజూ కొన్ని బాదం గింజల్ని నానబెట్టుకుని తీసుకుంటుంటారు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తినడం వల్ల చాలా ప్రయోజనాలని పొందచ్చని అందరికీ తెలిసిందే. అయితే బాదం టీ వలన కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది.

బాదంపప్పులో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పును తీసుకోవడం వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. మెగ్నీషియం కూడా ఇందులో ఉంటుంది. బాదం తీసుకోవడం వలన కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. బాదం టీ ని తీసుకోవడం వలన ఫైబర్, ప్రోటీన్, మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు ఇతర పోషకాలను కూడా మనం పొంద‌వ‌చ్చు.

Almonds Tea how to make this take daily
Almonds Tea

బాదం టీ ని మనం ఇన్ఫెక్షన్ల సమయంలో తీసుకున్నట్లయితే కోల్పోయిన పోషకాలని పొందవచ్చు. బరువు తగ్గే వాళ్ళు కూడా బాదం టీ ని తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. బాదంలో చక్కటి పోషకాలు ఉంటాయి. బాదం టీ ని తీసుకుంటే విటమిన్ ఈ మీకు కావాల్సినంత దొరుకుతుంది. విటమిన్ ఈ శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. బాదం టీ ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలని త‌గ్గిస్తుంది. కొవ్వుని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఆకలిని కూడా బాగా తగ్గిస్తుంది.

గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మనం బాదం టీ ని ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని చూసేద్దాం. చాలా మందికి బాదం టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియదు. బాదం టీ ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందు కొన్ని బాదం పప్పుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. తర్వాత రోజు బాగా నానిన బాదంపప్పులని తొక్క తీసి, ఎండలో బాగా ఆరబెట్టి బాదం పప్పుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని నీటిలో వేసి మరిగించుకుని ఆ నీళ్ళని తాగితే సరిపోతుంది. ఇలా రోజుకి ఒక కప్పు నిద్ర లేవగానే తాగొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment