నాగార్జున ఒరిజిన‌ల్ లుక్ లీక్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

July 7, 2021 3:58 PM

త‌న న‌ట‌న‌తో యువ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వృద్ధాప్య వ‌య‌స్సులోనూ ఆయన మ‌న్మథుడిలా క‌నిపిస్తుంటారు. ఆయ‌న ఈ వ‌య‌స్సులోనూ అంత య‌వ్వ‌నంగా క‌నిపించ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటా అని అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా లీకైన నాగార్జున ఫొటో ఒక‌దాన్ని చూసి అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు.

nagarjuna old age pic leaked fans trolls

నాగార్జున వ‌య‌స్సు 61 సంవ‌త్స‌రాలు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎప్పుడు క‌నిపించినా 30 ఏళ్ల మ‌న్మ‌థుడిలా ద‌ర్శ‌న‌మిచ్చేవారు. కానీ తాజాగా నాగార్జున వృద్ధుడి లుక్‌లో క‌నిపించే స‌రికి అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. నాగార్జున ఇలా మారిపోయారేంటి ? అని షాక‌వుతున్నారు.

తెల్ల‌ని జుట్టు, తెల్ల‌ని మీసాలు, ముఖంపై ముడ‌త‌లు, క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలతో నాగార్జున లేటెస్ట్ పిక్ లీకైంది. సోష‌ల్ మీడియాలో ఆ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఇది నాగార్జున ఒరిజిన‌ల్ గెట‌ప్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముస‌లి మ‌న్మ‌థుడు, తాత‌య్య అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆయ‌న ప‌క్క‌న ఉన్న‌ది ఎవ‌రు అనే విష‌యం నిర్దార‌ణ కాలేదు.

ఇక నాగార్జున ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ చేస్తుండ‌గా, క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో బంగార్రాజు అనే మూవీలో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో స్టార్ మా లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజ‌న్ 5కి హోస్ట్‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now