Mushroom Curry : దీన్ని వండి తింటే చాలు.. విట‌మిన్ డి అమాంతం పెరుగుతుంది..!

August 4, 2023 5:20 PM

Mushroom Curry : పోషకాహారం తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. పోషకాహారం తీసుకోకపోతే పోషకాహార లోపం మొదలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలని కచ్చితంగా మనం తీసుకుంటూ ఉండాలి. ప్రతి పోషక పదార్థం కూడా అవసరం. కొన్ని రకాల పోషకాలు లేకపోవడం వలన పోషకాహార లోపం కలుగుతుంది. విటమిన్ డి చాలా ముఖ్యమైనది.

విటమిన్ డి లోపం ఎముకలని ప్రభావితం చేస్తుంది. ఎముకల సమస్యకు కారణం అవుతుంది. రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నట్లయితే హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. రొమ్ము, ప్రాస్టేట్, పెద్ద పేగు వంటి క్యాన్సర్లకి కూడా కారణం అవుతుంది. విటమిన్ డి ఇమ్యూనిటీ శక్తిని బలపరుస్తుంది. విటమిన్ డి లోపం వ్యాధికార‌క పోరాడే శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది.

Mushroom Curry take this frequently to increase vitamin d
Mushroom Curry

విటమిన్ డి లెవెల్స్ ని చెక్ చేయించుకుని విటమిన్ డి లోపం ఉంటే కచ్చితంగా విటమిన్ డి అందేట్టు చూసుకోవాలి. విటమిన్ డి లోపం వలన మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. విటమిన్ డి తక్కువ ఉంటే డిప్రెషన్ కలుగుతుంది. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం.. తక్కువ విటమిన్ డి వలన కలుగుతాయి. విటమిన్ డి లేని వ్యక్తుల్లో చర్మంపై దద్దుర్లు రావడం, మొటిమలు వంటివి కలుగుతాయి. అలానే చర్మం త్వరగా ముడతలు పడుతుంది.

విటమిన్ డి లేకపోతే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఎముకల‌ వ్యాధి, ఎముకల నొప్పి, కండరాల బలహీనత వంటివి కలుగుతాయి. ఎండకి తక్కువగా ఉండే వాళ్ళు విటమిన్ డి లోపానికి గురవుతారు. మాంసాహారులకి విటమిన్ డి ఏదో ఒక ఆహార పదార్థంలో లభిస్తుంది. కానీ శాకాహారులకి విటమిన్ డి లోపం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శాకాహారులు పుట్టగొడుగులని తీసుకుంటే విటమిన్ డిని పొందొచ్చు. అయితే మామూలుగా పుట్టగొడుగులని తయారుచేసి తీసుకోవడం కంటే పుట్టగొడుగుల‌ను ఒకసారి ఎండలో ఎండబెట్టి, ఆ తర్వాత పుట్టగొడుగులని వండుకుని తీసుకుంటే విటమిన్ డి పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment