Sleep : రోజూ రాత్రి ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. అయితే ఇది చూడండి..!

August 1, 2023 8:40 AM

Sleep : కొంతమంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు. ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి. రాత్రి 12 దాటాకనే చాలా మంది నిద్రపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు క‌చ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేయడం, త్వరగా నిద్రపోవడం మంచి అలవాటు. అలాంటి అలవాటు ఉంటే ఆరోగ్యం పాడవదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు.

సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేచే వారి మేథ‌స్సు, అర్ధరాత్రి వరకు మెళ‌కువగా ఉండే వారి కంటే తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకుని లేచే వారు అత్యంత ఆశావాదులు, అత్యంత చురుకైన వాళ్ళు. త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్ర లేస్తే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. యాక్టివ్ గా ఉండగలరు.

if you are late sleep daily then know these
Sleep

అలానే అనుకున్న వాటిపై దృష్టి పెట్టొచ్చు. వారి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవుతుంది. పైగా త్వరగా నిద్రపోయి, త్వరగా లేవడం వలన మన పనులని ముందుగా మనం మొదలు పెట్టచ్చు. దానితో చాలా సమయం ఆదా అవుతుంది. ఎక్కువ సమయం ఇంకా మిగిలి ఉంటుంది. మన పనులు కూడా పూర్తయిపోతుంటాయి. ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్ర పట్టకపోవడం వలన నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మెదడు కూడా సరిగ్గా పని చేయదు.

హ్యాపీగా ఉంచే సెరోటోనిన్ వంటి హార్మోన్లు కూడా తక్కువ ఉత్పత్తి అవుతాయి. దాంతో ఆనందంగా కూడా ఉండలేరు. ఆలస్యంగా నిద్రపోయే వారి మెదడులో కార్టిసాల్ లెవెల్ పెరిగిపోతుంది. దీంతో ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది. ఇలా ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆరోగ్యం పాడవడం మొదలు ఒత్తిడి, ఆనందం ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ తప్పును చేయకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now