Pot Breaking : అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో కుండ‌లో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 30, 2023 2:49 PM

Pot Breaking : శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి.

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా వేరైపోతాయి. శరీరాన్ని దహనం చేసే దాకా మళ్లీ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాడె కట్టేసి శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు శ్మ‌శానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ వస్తుందట.

Pot Breaking during cremation why do like that
Pot Breaking

బియ్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజలు లెక్కించిన తర్వాత మాత్రమే చూడడానికి అవుతుంది. అది కూడా సూర్యాస్తమయం లోపు మాత్రమే. అంత సేపు లోగా లెక్కించకపోతే మళ్లీ మొదటి నుండి లెక్క పెట్టాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రము పెట్టి, దాని నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో.. శరీరం నుండి ఆత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు.

కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చిస్తాము.. ఇక నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు. దాంతో ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. మన పెద్దవాళ్లు చేశారు. మన పూర్వీకులు చేశారు. అలానే మనం కూడా పాటించాలని మనం చేస్తాం తప్ప దాని వెనుక కారణమైతే మనకు తెలియదు. కానీ దాని వెనుక కారణమైతే ఇది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment