వీడియో వైరల్: కళ్ళు మూసి తెరిచేలోగా నేలమట్టమైన 12 అంతస్థుల భవనం!

July 6, 2021 7:15 PM

గత నెల 24వ తేదీన అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో కేవలం కనురెప్పపాటు కాలంలో 12 అంతస్థుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా ఇంకా 121 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా మిగిలిన భవన శిథిలాలను బాంబుల సహాయంతో కూల్చివేశారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది మరణించినట్లు అధికారులు గుర్తించగా మరియు 121 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.అయితే ఈ భవనం కూలిపోవడానికి కారణాలను పరిశీలించగా ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లను గుర్తించినట్లు ఇంజనీర్లు తెలియజేశారు. వాటికి త్వరలోనే మరమ్మతులు చేయాల్సి ఉండగా ఇంతలోనే ఈ విధమైనటువంటి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు.

ఈ క్రమంలోనే వచ్చే వారంలో ఎల్సా తుఫాన్ కారణంగా సర్ఫ్‌సైడ్‌లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్‌ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత బాంబులతో ఆ భవనాన్ని కూల్చివేశారు. ఈ భవనాన్ని కూల్చివేసే సంఘటనను చూడటానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.ప్రస్తుతం ఈ భవనం కూల్చివేస్తున్నటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment