ఈ మూడు ర‌కాల వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల్సిందే..!

July 15, 2023 11:30 AM

కొంత మంది వ్యక్తులకి మనం ఎంత దగ్గరగా ఉంటే, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి మాత్రం కాస్త దూరంగానే ఉండాలని ఆచార్య చాణక్య అన్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్య నుండి బయటపడొచ్చు. చాణక్య ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలని, ఆయన తెలుసుకున్న సత్యాలని పుస్తక రూపంలో మనకి అందజేశారు.

ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా మనకి పరిష్కారం కనబడుతుంది. చాణక్యనీతిలో ఆచార్య చాణక్య ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలనే విషయానికి వస్తే.. స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని, ఇటువంటి వాళ్ళు ప్రమాదకరమని చాణక్య రాసారు. కోపంలో ఉండే వ్యక్తులతో కూడా దూరంగా ఉండడం మంచిదని చాణక్య వివరించారు.

you should stay away from these 3 types of persons

పొగిడే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. స్వార్థంతో ఉండేవాళ్ళు ఎప్పుడు వారి గురించి ఆలోచించి, పక్క వాళ్ళని ముంచేస్తారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇతరుల గురించి పట్టించుకోడు స్వార్ధపరుడు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అలానే కోపంలో ఉండే వ్యక్తి ని కూడా దూరంగా పెట్టాలి. అదే విధంగా పొగిడే వ్యక్తి మీ ముందు పొగిడి, మిమ్మల్ని వెనుక తిడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటమే మంచిది.

మీ ముఖం మీద పొగిడే వ్యక్తి కచ్చితంగా మీ వెనుక చెడు చేస్తాడు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మూడు ర‌కాల‌ వ్యక్తులకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటి వాళ్ళని కనుక మీరు శ్రేయోభిలాషులుగా భావించారంటే కచ్చితంగా మీ జీవితం పాడవుతుందని గుర్తు పెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment