Vastu Plants : వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ మొక్క‌ల‌ను పెంచండి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

July 13, 2023 3:49 PM

Vastu Plants : వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కల్ని నాటితే ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుంది. అదే విధంగా అదృష్టం కూడా కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలని పెంచుకోవాలి, ఎలాంటి మొక్కలు ఉంటే శుభం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. వీటిని కనుక మీరు పాటించారంటే ఇక మీకు తిరుగే ఉండదు. ఇంటి నిర్మాణానికి ఎలా అయితే వాస్తు ఉంటుందో, అదే విధంగా ఇంట్లో మొక్కల్ని పెంచడానికి కూడా వాస్తు ఉంటుంది. ఇంట్లో మొక్కలు ఏ దిశలో నాటాలి అనేది చాలా ముఖ్యమైనది.

వాటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా మీరు అనుసరిస్తే అంతా శుభమే జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అరటి చెట్లని ఇంట్లో నాటడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అరటి మొక్కని మీరు కుండీలో నాటవచ్చు. ఇంటికి పడమర దిక్కున మాత్రం అస్సలు అరటి మొక్క ఉండకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే కూడా లక్ష్మీ దేవి అక్కడ ఉంటుంది. ఈ మొక్కను ఇంటి లోపల పెడితే లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుంది.

Vastu Plants grow them in your house for luck and wealth
Vastu Plants

ఆర్థిక బాధలు ఏమీ ఉండవు. అయితే మనీ ప్లాంట్ ని ఆగ్నేయం వైపు పెడితే మంచిది. అలానే తులసి మొక్క కచ్చితంగా ఇంట్లో ఉండాలి. తులసి మొక్క ఇంటికి ఉత్తరం వైపు కానీ లేదా ఈశాన్యం వైపు కానీ ఉంటే మంచిది. తులసి మొక్క దగ్గర రోజూ దీపం పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి.

అశోక మొక్క ఇంట్లో ఉంటే కూడా మంచిదే. దీన్ని ఉత్తర దిశలో పెట్టాలి. సానుకూల శక్తిని ఇది తీసుకు వస్తుంది. ఇంట్లో లక్కీ బాంబూ ట్రీ ఉంటే కూడా మంచి జరుగుతుంది. ఈ మొక్కని ఆఫీస్ టేబుల్ మీద కానీ లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టినా కూడా అదృష్టం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment