Lakshmi Devi : ఆర్థిక బాధలు తొలగి.. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే.. ఇలా చేయండి..!

July 10, 2023 9:50 PM

Lakshmi Devi : చాలా మంది రకరకాల బాధల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటూ ఉంటుంది. ఎక్కువ మంది ఆర్థిక బాధలతో బాధపడతారు. ఆ బాధ నుండి బయటపడి, సిరి సంపదలని పొందాలంటే, లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి. ఇలా కనుక లక్ష్మీదేవిని పూజించారంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇంటికి సిరిసంపదలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్న విషయాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇలా కనుక ఆచరించారంటే ఇక మీకు తిరుగు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే భక్తితో స్పటిక మాల వేసుకోవాలి. స్పటిక మాల ధరించి లక్ష్మీదేవిని కొలిస్తే, అమ్మవారి అనుగ్రహం త్వరగా మీకు లభిస్తుంది. స్పటిక మాల వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. పైగా అమ్మవారికి చాలా ఇష్టం. స్పటిక మాల వేసుకుని పూజలు చేయడం వలన చక్కటి లాభాలను పొందవ‌చ్చు.

follow this tip to get blessings from lakshmi devi
Lakshmi Devi

శుక్రుడి గ్రహ స్థితి మారి మీకు ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. ఇళ్లల్లో విభేదాలు తొలగిపోవడానికి, ఈ మాలతో జపం చేయడం మంచిది. ముఖ్యంగా దంపతుల మధ్య సమస్యలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. శుక్రుని మంత్రాన్ని స్పటిక మాల వేసుకుని జపించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందొచ్చు. మీరు స్పటిక మాల వేసుకుని లక్ష్మీదేవి మంత్రాలని, సరస్వతి దేవి మంత్రాలని కూడా జపించొచ్చు.

ఇది కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ విధంగా మీరు ఆచరించారంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు. మీ ఇంటికి సిరిసంపదలు వస్తాయి. ఎలాంటి ఆర్థిక బాధలున్నా కూడా ఈ విధంగా తొలగిపోతాయి. అదే విధంగా ప్రతి శుక్రవారం మర్చిపోకుండా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment