వీళ్ళు ఇంటికి వస్తే.. శుభాలే కలుగుతాయి.. బాధలన్నీ పోతాయి..!

July 10, 2023 8:30 AM

మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన మన ఇంట్లో చెడు జరుగుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవాలి. మనం చేసే మంచి పనుల‌ వలన మనకి అంతా శుభమే జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. మరి మీరు ఎంత వరకు పాటిస్తున్నారో ఇప్పుడే చూసుకోండి. చాలా మంది ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే సరిగ్గా ప్రవర్తించరు. ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే శాస్త్రాల ప్రకారం అది ఎంతో శుభం. ఆడపడుచు మీ ఇంటికి వస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.

అల్లుడు ఇంటికి వస్తే కూడా అది ఎంతో శుభప్రదం. అదే విధంగా మేనల్లుడు ఇంటికి వచ్చినట్లయితే శాస్త్రం ప్రకారం అది చాలా మంచిది. ఎంతో మంచి జరుగుతుంది. మీకు మేనల్లుడు ఉండి ఇంటికి వస్తే కూడా చక్కగా గౌరవించండి. అదే విధంగా ఇంటికి ఎవరైనా సాధువులు లేదంటే మహానుభావులు, గురువులు, పండితులు వంటి వారు వస్తే కచ్చితంగా గౌరవించండి. ఎప్పుడైనా కూడా వీళ్లు వచ్చారంటే చక్కగా వాళ్ళని పలకరించి, వాళ్ళని గౌరవించండి. అప్పుడు అంతా మీకు మంచే జరుగుతుంది.

if these persons come to your house you will get lucky

శాస్త్రం ప్రకారం ఇది ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులకు క‌చ్చితంగా మర్యాద చేయాలి. అలానే భోజనం పెట్టాలి. ఎప్పుడైనా కూడా మీరు ఎవరింటికైనా అతిథిగా వెళ్తే అక్కడ భోజనం బాగోకపోతే వారికి ఆ విషయాన్ని చెప్పకూడదు. అలానే ఇంటికి ఆడపిల్ల వస్తే ఆ ఆడపిల్లని పంపించేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు వంటివి ఇచ్చి ఆమెని పంపించాలి.

ఇలా వీటిని ఆచరించారంటే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇవి మీకు శుభాన్ని కలిగించేవి. కాబట్టి వీటిని అస్సలు పాటించడం మర్చిపోకండి. కచ్చితంగా ఈ విషయాలని గుర్తు పెట్టుకొని పాటించారంటే, మీ ఇంటికి అన్ని శుభాలే వస్తాయి. అంతా మంచే జరుగుతుంది. ఏ బాధ కలగదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment