రూ.6699కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

July 2, 2021 2:26 PM

మొబైల్స్ త‌యారీదారు టెక్నో మొబైల్.. స్పార్క్ గో 2021 పేరిట ఓ నూత‌న బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 1500 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ20 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 2జీబీ ర్యామ్ ల‌భిస్తుంది.

TECNO Spark Go 2021 smart phone launched in india

ఈ ఫోన్‌లో 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 గో ఎడిష‌న్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్ ధ‌రను రూ.6,699గా నిర్ణ‌యించారు. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment