శ్రావ‌ణ మాసం ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో తెలుసుకోండి..!

July 2, 2021 5:50 PM

ముఖ్యమైన రోజులు, పండుగల తేదీలను నిర్ణయించడానికి హిందువులు సాంప్రదాయ చాంద్ర‌మాన‌ క్యాలెండర్‌ను అనుసరిస్తారు. ఉత్తర భారత రాష్ట్రాల (ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్) భక్తులు చాంద్ర‌మాన‌ క్యాలెండర్‌ను అనుసరిస్తుంటారు. అలాగే దక్షిణ (మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక) భ‌క్తులు సౌర‌మాన క్యాలెండర్ ను అనుస‌రిస్తారు. ఈ రెండు క్యాలెండర్ల‌లో పండుగ‌ల ప్రారంభ తేదీల‌కు పదిహేను రోజుల అంతరం ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాలలో వేర్వేరు తేదీలలో పండుగలను జ‌రుపుకుంటుంటారు.

know shravana masam starting date

ప‌విత్ర‌మైన శ్రావ‌ణ మాసంలో శివున్ని భ‌క్తులు పూజిస్తారు. కొంద‌రు విష్ణువుకు పూజ‌లు చేస్తారు. సౌర మాన క్యాలెండ‌ర్‌ను పాటిస్తే ఆగ‌స్టు నెల‌లో శ్రావ‌ణ మాసం వ‌స్తుంది. శ్రావ‌ణ మాసంలో శివ‌పార్వతుల‌కు పూజ‌లు చేస్తుంటారు. త‌పస్సు చేసేందుకు, వ్ర‌తాల‌ను ఆచ‌రించేందుకు ఈ మాసాన్ని చాలా ఉప‌యుక్తంగా ఉండేదిగా భావిస్తారు.

శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, మంగళవారం, శుక్ర‌, శ‌ని వారాల్లో భక్తులు వ్రతాల‌ను ఆచ‌రిస్తారు. మంగ‌ళ‌వారాల్లో మంగ‌ళ గౌరి వ్ర‌తం చేస్తారు. ఇక చాంద్ర‌మాన క్యాలెండ‌ర్ ప్ర‌కారం శ్రావ‌ణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 22తో ముగుస్తుంది. అలాగే సౌర‌మాన క్యాలెండ‌ర్ ప్రకారం శ్రావణ మాసం ఆగస్టు 9న ప్రారంభమై, సెప్టెంబర్ 6 తో ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment