HECL లో 206 ట్రైనీ అప్రెంటిస్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు మార్కుల ద్వారా ఎంపిక..

July 1, 2021 4:26 PM

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. HECL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 206 ట్రైనీ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో కోపా, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ వంటి పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు జూలై 31 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అభ్యర్థులను ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. మిగతా అభ్యర్థులు రూ.750 ల పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. HECL విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి.https://www.hecltd.com/ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జూలై 31.2021.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment