Black Carrots : న‌ల్ల క్యారెట్‌లు కూడా ఉంటాయి తెలుసా.. వీటిని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

April 27, 2023 8:26 PM

Black Carrots : మనలో చాలా మంది క్యారెట్లను చాలా ఇష్టంగా తింటారు. అయితే మనం తినే క్యారెట్లు నారింజ రంగులో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటాయి. అయితే నలుపు రంగులో ఉండే క్యారెట్స్ కూడా ఈ మధ్యకాలంలో లభిస్తున్నాయి. ఈ నలుపు రంగులో ఉండే క్యారెట్స్ కాస్త తీయగాను కాస్త కారంగాను ఉంటాయి. బ్లాక్ క్యారెట్ తినడం వలన ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలను పొందవచ్చు. ఇక పోషకాల విషయానికి వస్తే కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్, జింక్‌, విట‌మిన్ ఇ, విటమిన్ కె, విట‌మిన్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

ముఖ్యంగా ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక న‌లుపు రంగు క్యారెట్ తీసుకుంటే ఆ సమస్య నుండి తొందరగా బయట పడతారు. బ్లాక్ క్యారెట్ ల‌లో ఆంథోసైనిన్స్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో మరియు ధమనులను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఆరెంజ్‌ క్యారెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరచి అల్జీమర్స్ వ‌చ్చే రిస్క్‌ను తగ్గించి ఆలోచ‌నా శ‌క్తి, జ్ఞాప‌క శక్తిని పెంచుతాయి.

amazing health benefits of Black Carrots
Black Carrots

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతాయి. బ్లాక్ క్యారెట్‌ల‌లోని కొన్ని క్రియాశీల పదార్ధాలు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్ సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

కంటికి సంబందించిన సమస్యలు ఏమీ లేకుండా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కంటి చూపు సమస్యలు, శుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో శరీరంలో ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ విడుదలను నియంత్రించడంలో సహాయపడుతాయి. కాబట్టి బ్లాక్ క్యారెట్ ల‌ను త‌ర‌చూ తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment