Photo Poses : ఏ పోజ్‌లో ఫొటో దిగితే బాగా వస్తుందో తెలుసా.. కావాలంటే ఇది చూడండి..!

April 18, 2023 7:28 PM

Photo Poses : సెల్ఫీ అయినా.. మామూలు ఫొటో అయినా.. నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫొటోలను దిగేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా డిజిటల్ కెమెరా ద్వారా దిగినా ఫొటోలు చక్కగా ఉంటేనే ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే అద్భుతమైన పోజ్‌లతో ఫొటోలు దిగవచ్చు. ఆ టిప్స్, పోజ్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిలబడి ఫుల్ లెంగ్త్‌లో ఫొటో దిగేటప్పుడు ఒక‌ పోజ్‌ను ట్రై చేయాలి. ఏదైనా ఒక సైడ్‌కి తిరిగినట్టుగా నిలుచుని ఒక చేతిని నడుంపై వేయాలి. మరో చేతిని అలాగే వదిలేయాలి. మనం తిరిగిన సైడ్‌కి అనుగుణంగా తలను తిప్పి స్ట్రెయిట్‌గా నిలబడి చూడాలి. ఈ పోజ్‌లో ఫొటో దిగితే పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.

కెమెరా వైపు స్ట్రెయిట్‌గా నిలబడి ఉన్నప్పుడు ఏదైనా ఒక సైడ్ ఎంచుకుని ఆ వైపు చేయిని నడుంపై వేయాలి. అనంతరం అదే వైపు కాలును మోకాలి వద్ద కొద్దిగా ముందుకు వంచాలి. తలను ఈ వైపు కాకుండా మరో వైపు కొద్దిగా వంచాలి. అవతలి వైపు ఉన్న చేయి, కాలును అలాగే వదిలేయాలి. ఈ పోజ్‌లో ఫొటో దిగినా బాగా కనిపిస్తారు. ఈ టిప్ పై దాన్ని పోలి ఉంటుంది. కాకపోతే కొద్దిగా మార్పు ఉంటుంది. పై దాంట్లో కేవలం ఒక చేయిని మాత్రమే నడుంపై వేయాలని చెప్పాం కదా. కానీ ఈ పోజ్‌లో రెండు చేతులను నడుంపై వేసి మిగతాదంతా పైన చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఇలా ఈ పోజ్ కూడా చక్కని ఫొటోలను ఇస్తుంది.

Photo Poses you must try for better photos
Photo Poses

ఏదైనా ఒక సైడ్‌కి తిరిగి స్ట్రెయిట్‌గా చూడాలి. అదే సమయంలో చేతులను రెండింటినీ కట్టుకోవాలి. తలను ఓ వైపుగా తిప్పాలి. ఈ భంగిమలోనూ ఫొటో బాగానే వస్తుంది. బొమ్మలోలా హాఫ్ సైజ్ స్ట్రెయిట్ ఫొటో దిగాలంటే తలను ఏదైనా ఒక వైపు వంచాలి. అనంతరం ఒక చేయిని కట్టుకున్నట్టుగా మడిచి దానిపై మరో చేయికి చెందిన మోచేయి ఆనేలా చేతిని పైకి పెట్టాలి. ఈ విధానంలో కూడా ఫొటోలను ఆకర్షణీయంగా దిగవచ్చు. ఇప్పుడు చెప్పబోయే భంగిమ కూడా పై దానిలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఓ చేయిని మాత్రమే ముఖం దగ్గర‌ పైకి పెట్టాలి. మరో చేయిని నడుంపై ఉంచాలి. తలను ఒక వైపు కొంచెం తిప్పాలి. ఈ పోజ్ కూడా బాగానే ఉపయోగపడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment