Turban : సిఖ్ వర్గీయులు తలకు పాగా (టర్బన్) ఎందుకు ధరిస్తారు..?

April 16, 2023 11:37 AM

Turban : భారతదేశం అనేక సాంప్రదాయాలకు, విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ నివసించే వివిధ రకాల మతస్తులు తమ మత పద్ధతులకు అనుగుణంగా ఆయా సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే ఒక్కో మతంలో వారి విశ్వాసాలకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు ఉన్నట్టే సిఖ్ మతంలోనూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది తలపాగా (టర్బన్) కూడా ఒకటి. దీన్ని దస్తర్ అని కూడా అంటారు. అయితే సిక్కులు ఈ టర్బన్‌ను ఎందుకు ధరిస్తారు..? తెలుసుకుందాం రండి.

మన తెలుగు సాంప్రదాయాల్లో దేవుళ్లు, దేవతలకు తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం కదా! మనం మొక్కు ప్రకారం దైవానికి ఆ వెంట్రుకలను సమర్పిస్తాం. అయితే సిక్కులు కూడా తమ జుట్టును ఇలాగే దైవానికి గౌరవంగా భావిస్తారు. కాకపోతే మనం తల వెంట్రుకలను తీసేస్తాం. వారు తీయరు. అంతే తేడా. అయితే వారు అలా గౌరవంగా భావించే జుట్టును సంరక్షించడం కోసం తలకు చుట్టూ పాగా కట్టుకుంటారు. సిక్కులు టర్బన్ ధరించడం వెనుక మరో కారణం కూడా ఉంది. సిక్కు గురువులలో 10వ వారైన గురు గోవింద్ సింగ్ జీ హయాంలో సిక్కుల్లో వర్గ విభేదాలు పెచ్చుమీరాయి. ధనికులు ఎక్కువ, పేదవారు తక్కువ అనే భావనలు ఏర్పడ్డాయి.

why do sikh people wear turban
Turban

దీన్ని నివారించడం కోసం గురు గోవింద్ సింగ్ జీ సిక్కులందరూ ఒక్కటేనని చాటి చెబుతూ ప్రతి సిక్కు వర్గీయుడు విధిగా టర్బన్ ధరించాలని ఆదేశించారు. దీంతో సిక్కులందరూ సమానమే అన్న భావన ఏర్పడింది. అదేవిధంగా గురు గోవింద్ సింగ్ జీ తన హయాంలో సిక్కులను సులభంగా గుర్తించడం కోసం టర్బన్ ఉపయోగపడుతుందని కూడా చెప్పారు. దీంతో ఆయన కాలం నుంచి సిక్కులు టర్బన్‌ను ధరిస్తున్నారు. అయితే సిఖ్ వర్గీయుల్లో మహిళలు టర్బన్‌నను ధరించరు. అందుకు బదులుగా తమ తలను చీర కొంగు లేదా చున్నీతో కప్పుకుంటారు.

కేవలం సిక్కుల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు క్రిస్టియన్, ముస్లిం వర్గాల్లోనూ టర్బన్‌ను ధరించే ఆచారం ఉంది. అయితే వారంతా తమ తమ మత ఆచార వ్యవహారాలకు అనుగుణంగా టర్బన్‌ను ధరిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment