Wedding Card : వివాహ ఆహ్వాన పత్రాలపై గణేషుడి బొమ్మను ముద్రించ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

April 16, 2023 8:44 AM

Wedding Card : హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి. ఏ పనైనా విఘ్నం (ఆటంకం) లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవ దేవుడికి అందుతుంది. అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్)లపై గణేషుడి బొమ్మను కూడా కచ్చితంగా ముద్రిస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషికి తెలివితేటలు, ప్రతిభ, నైపుణ్యాలను కలగజేసే దేవుడిగా విఘ్నేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు. అందుకే చదువుల తల్లి సరస్వతీ దేవితోపాటు ఆయన్ను కూడా విద్యకు, కళలకు అధిపతిగా భావిస్తున్నారు. అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించే ముందు వినాయకుడి ఆశీస్సులు తప్పనిసరిగా పొందాలని చెబుతారు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి విషయం పట్ల సూక్ష్మ దృష్టిని, విశ్లేషణాత్మక శక్తిని కలిగి ఉండాలని వినాయకుడికి ఉండే చిన్నపాటి కళ్లు చెబుతాయి. సృష్టిలో జీవించే ప్రతి ప్రాణిని సమ దృష్టితో చూడాలని, అందరికీ సమన్యాయం ఉండాలని వినాయకుడికి ఉండే తొండం సూచిస్తుంది.

why lord ganesha photo printed on Wedding Card
Wedding Card

వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉంటుంది కదా. అయితే పెద్దగా ఉన్న దంతం నమ్మకాన్ని సూచిస్తే, చిన్నగా ఉన్న దంతం ప్రతిభను, నైపుణ్యాన్ని, తెలివితేటలను సూచిస్తుంది. అన్ని విఘ్నాలను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడికి పేరుందని చెప్పాం కదా. అవును, అందుకే ఎవరి జీవితంలోనైనా జరిగే కేవలం ఒకే ఒక్క, అతి పెద్ద పండుగైన వివాహానికి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు కలగకూడదనే నమ్మకంతో వివాహ ఆహ్వాన పత్రాలపై ఆయన బొమ్మను ముద్రిస్తారు. ఇదీ.. దాని వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment