Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

April 14, 2023 8:50 AM

Diabetes Symptoms : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంది. అయితే వీటిని సూచిస్తూ మన శరీరం ముందుగానే కొన్ని అనారోగ్య లక్షణాలను మనకు తెలుపుతుంది. కానీ మనలో అధిక శాతం మంది ఈ అనారోగ్య లక్షణాలు, సూచనలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో సమస్య వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తోంది. అయితే శరీరం ఎప్పటికప్పుడు తెలియజేసే అనారోగ్య హెచ్చరికలను ముందుగానే పసిగడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి.

రక్తంలో చక్కెరలు ఎక్కువగా పేరుకోవడం వల్ల, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక, ఒకవేళ ఉత్పత్తి అయినా శరీరం దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల, నిత్యం శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఇది వచ్చే క్రమంలో మనకు ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని వల్ల ఎంతో కొంత జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉంటే నోరు ఎల్లప్పుడూ పొడిగా ఉంటుంది. దీంతోపాటు దాహం ఎక్కువగా వేస్తుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు. సాధారణంగా రాత్రి పూట ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. సాధారణంగా నిత్యం శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారు, పనిచేసే వారు అలసిపోతుంటారు. అలా కాకుండానే మామూలుగానే అలసిపోయినట్టుగా ఉంటే వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి.

Diabetes Symptoms must know about them
Diabetes Symptoms

ఎల్లప్పుడూ శక్తి లేనట్టుగా, నీరసంగా, నిస్సత్తువగా ఉంటే వెంటనే షుగర్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. అవసరమైతే వైద్యున్ని సంప్రదించాలి. ఎక్కువగా ఆకలి వేస్తున్నా, చర్మంపై దురదలు వస్తున్నా, బరువు పెరుగుతున్నా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. షుగర్ ఉంటే జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేయదు. దీంతోపాటు గాయాలు, పుండ్లు, దెబ్బల వంటివి త్వరగా మానవు. ఏకాగ్రత కోల్పోవడం, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కూడా హై బ్లడ్ షుగర్‌ను సూచిస్తాయి.

షుగర్ వ్యాధి ఉంటే గ్లయిసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటి వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి. పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే ఆహార సంబంధ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రధానంగా సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతోపాటు జంక్ ఫుడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment