Death : చావు దగ్గరగా ఉందని తెలియజేసే ల‌క్ష‌ణాలు ఇవే..!

April 10, 2023 3:47 PM

Death : మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని లక్షణాలు మ‌న‌కు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.

చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.

these symptoms happen before Death
Death

కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని చెబుతారు. అయితే వీటిల్లో నిజాలు ఉన్నాయో లేదో తెలియ‌దు కానీ.. వీటి గురించి మాత్రం త‌ర‌చూ చెబుతుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment