వర్షాకాలం మొదలైంది.. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహారం తప్పనిసరి!

June 29, 2021 4:01 PM

వర్షాకాలం మొదలవడంతో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతాయి. ఈ క్రమంలోనే ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఆహార విషయంలో మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అంటువ్యాధుల తో పోరాడి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

* వర్షాకాలం మొదలవడంతో ఆ సీజన్లో లభించేటువంటి తాజా పండ్లను తీసుకోవాలి. ఈ విధంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు

*ఎన్నో ఔషధగుణాలను దాగిఉన్న వెల్లుల్లిని వర్షాకాలంలో కొంచెం అధిక పరిమాణంలో తీసుకోవాలి. వంటలలో వెల్లుల్లిని వేసి తినటం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు అందుతాయి.

*వర్షాకాలం అని పెరుగుని తినడం మానేయకూడదు. తరచూ పెరుగుని తినడం వల్ల పెరుగులో ఉండేటటువంటి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

*జీర్ణవ్యవస్థను రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయాలంటే మన ఆహారంలో తప్పనిసరిగా తేనె ఉండాలి. తేనెలో ఫైటోన్యూట్రియెంట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకతలా పనిచేస్తాయి.

*కాలం ఏదైనా కూడా మన శరీరానికి తగినంత నీరు ఎంతో అవసరం కనుక నీటిని కూడా అధికమొత్తంలో తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment