Arjuna Tree : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా స‌రే దీని బెర‌డును మాత్రం విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

March 17, 2023 5:26 PM

Arjuna Tree : అర్జున వృక్షం (తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున. దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషధంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవ‌చ్చట. అంతేకాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ ఫుల్ ఔషధంగా అనేక మందుల్లో ఉపయోగిస్తున్నారు.

అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాష‌న్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. అర్జునని ఆస్తమా ఉన్నవారు కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే శ్వాస నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, ఆస్తమాను తగ్గేలా చేస్తుంది.

Arjuna Tree and its bark benefits how to use
Arjuna Tree

అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణంను తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా ప్ర‌ఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో ఎముకల‌ను అతికించ‌డానికి దీన్నే ప్రధాన ఔషధంగా ఉప‌యోగిస్తున్నారు. దీనిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడుతుంది. ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ ల కంటే 3 రెట్ల‌ ప్రభావాన్ని చూపిస్తుంది.

అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు, పుండ్లు తగ్గుతాయి. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది. దీంతో పురుషుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. అలాగే శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. అంతటి పవర్ అర్జున బెరడుకు ఉంటుంది. క‌నుక ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా స‌రే దీని బెర‌డును మాత్రం మ‌రిచిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment